పల్లవి:నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా (1)
చరణం 1:నీ యౌవనములో - నీ హృదయమును - సంతృప్తిగా - నుండనిమ్ము (2)
ఆయితే వీటిని బట్టి దేవుడు
తీర్పులోనికి - తెచ్చు నిన్ను (2)
చరణం 2:దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని
చెప్పుసమయము రాకమునుపే
సృష్టికర్తను స్మరియించుమా
చరణం 3:నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా
ప్రభువును బోలి నడచుకొనుమా
మాదిరి కరముగా జీవించుమా
చరణం 4:వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా
మన్నన చేయుచు పరుల కార్యముల
స్వకార్యముల వలె భావించుమా
చరణం 5:ప్రేమ సంతోష - సమాధానము దీర్ఘ శాంత దయాళుత్వము
మంచితనము సాత్వీక విశ్వాసము
కలిగి యుండి జీవించుమా
చరణం 6:మేలు చేయుట యందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు
సహనముతో ప్రభు సేవ చేసిన
ఫలము ననుభవించెదవు
చరణం 7:హల్లెలూయ పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై
ఉల్లము నందు సంతసించుచు
పాడుము ప్రభునకు హల్లెలూయ