CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 93

క్రీస్తు యేసు ప్రభుని - శరీరమే సంఘం

kreestu yesu prabhuni - shareerame sangham

More
పల్లవి:క్రీస్తు యేసు ప్రభుని - శరీరమే సంఘం (1) మీరు దానిలో వేరు వేరు -  అంగములై యున్నారు (2)
చరణం 1:చీకటిలో నున్న మిమ్ములను తన - ఆశ్చర్యమైన వెలుగులోనికి (2) మిమ్మును పిలిచిన యేసుప్రభుని గుణాతిశయములు ప్రచురించుడి (1)
చరణం 2:రాజులైన యాజక సమూహమును-దేవుని సొత్తైన ప్రజలైయున్నారు ఆత్మకు విరోధమై యుండె - శరీరాశలను విసర్జించుడి
చరణం 3:దేవునికి అనుకూలముగా- ఆత్మీయ బలులర్పించుటకై పరిశుద్ధ యాజకులుగా యుండునట్లు సజీవ రాళ్ళమై యున్నాము
చరణం 4:దేవుడు పరిశుద్ధుడు గనుక - మీరు పరిశుద్ధులై యుండుడి వ్యర్థ ప్రవర్తనను విడనాడి- నిందా రహితులై జీవించుడి
చరణం 5:ఏకముగను కలిసి వసించును - శరీరములోని అంగములు శిరస్సైన ప్రభునకు లోబడియుండి కలిసి యుండుడి ప్రేమలో