పల్లవి:నడిచెద నే ప్రభు యేసునితో - నడిచెద నే ప్రభు హస్తముతోకాంతిలో నుండగ జయంగాంతును- యేసునే నే వెంబడింతును (1)
చరణం 1:నే యేసుని వెలుగులో నడిచెదను-రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను- వెంబడించెదను యేసుడే నా రక్షకుడు (1)
చరణం 2:నే యేసుని వెలుగులో నడిచెదను-గాఢంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుండు ॥ నడిచెద ॥
చరణం 3:నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడు (1) ॥ నడిచెద ॥
చరణం 4:నే యేసుని వెలుగులో నడిచెదను-దిన సహాయము నే పొందెదను
సుఖ దుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును ॥ నడిచెద ॥
చరణం 5:నే యేసుని వెలుగులో నడిచెదను-నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వధ్వజమునే బట్టి వెళ్లెదను యేసుడే నా చెంత నుండును ॥ నడిచెద ॥