పల్లవి:హృదయ మర్పించెదము ప్రభునకుస్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి (2)
చరణం 1:పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ (2)
పాపుల పాపము తొలగించుటకు (2)
నిత్యజీవము నిచ్చెన్ (2)
చరణం 2:సంకట క్లేశము భరించెన్ నమ్రతతో నానుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
నిత్య నిరీక్షణ నిచ్చెన్
చరణం 3:ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు
నిలువకు పాపములో
చరణం 4:అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల
ఇదియే మా వినతి