పల్లవి:మేము భయపడము ఇక మేము భయపడము (1)ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు (2)
చరణం 1:దైవభ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించె (2)
దివారాత్రులు దేవుడే కాయును (1)
చరణం 2:శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగజూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును
చరణం 3:అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చె మాతోనుండ
యే ఘడియైనను విడువక కాయును
చరణం 4:బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి
పలు విధములుగా కాపాడుమమ్ము
చరణం 5:కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు
కనుపాపగ మమ్ము కాపాడునెప్పుడు
చరణం 6:జీవిత కష్టనష్టములు ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవులు నెంచుచు
చరణం 7:ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్మ
హిమపరచి మ్రొక్కెదమిలలో