CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 84

యౌవన జనమా జయమొందుమా

yauvana janamaa jayamondumaa

1 యోహాను 2:14 “యౌవనస్థులారా, ... దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు”

More
పల్లవి:యౌవన జనమా జయమొందుమా - విజయుండు క్రీస్తేసుని పొంది (1)పరుగిడుము - పందెము నందు (2)
చరణం 1:పాపభారముతో - ప్రయాస పడుచు గురి లేక నీవు - తిరిగితివా? (2) పరుగిడుచు రారమ్ము - ప్రభుచెంతకు పొందెదవు ఆత్మశాంతిన్ పొందెదవు - ఆత్మశాంతిన్ (1)
చరణం 2:ప్రార్ధన యందు - నిలకడ కలిగి వాక్యము నందు - కదలక నిలచి మంచి పోరాటము - పోరాడుము-జయమొందు - సాతాను పై జయమొందు - సాతాను పై
చరణం 3:యౌవనేచ్ఛల నుండి - పారిపొమ్ము ప్రభు సేవ చేయ - కోరి రమ్ము ఆత్మలను చేర్చు - ప్రభు చెంతకు -పొందెదవు బహుమానమున్ పొందెదవు బహుమానమున్
చరణం 4:సంఘము నందు - అంగముగ నిలచి సహవాసమందు - స్థిరముగ నుండి వేచియుండుము - ప్రభు రాకకై- హల్లెలూయ గీతములతో హల్లెలూయ - గీతములతో