పల్లవి:దేవుడు మీకు ఎల్లప్పుడు - దేవుడు మనకు ఎల్లప్పుడుతోడుగ నున్నాడు ..........3 సార్లు
చరణం 1:ఏదేనులో ఆదాముతో నుండెన్ - హానోకు తోడనేగేను
దీర్ఘదర్శకులతో నుండెన్ (2)
ధన్యులు దేవుని గలవారు (2) – తోడుగనున్నాడు (1)
చరణం 2:దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగ నాబ్రాహాము
కన్న కొమరుని ఖండించుటకు
ఖడ్గము నెత్తిన యపుడు –తోడుగనున్నాడు
చరణం 3:యోసేపు ద్వేషించ బడినపుడు - గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు
సింహాసనమెక్కినయపుడు –తోడుగనున్నాడు
చరణం 4:ఎర్రసముద్రపు తీరము నందు - ఫరోతరిమిన దినమందు
యోర్దాను దాటిన దినమందు
యెరికో కూలిన దినమందు -తోడుగనున్నాడు
చరణం 5:దావీదు సింహము నెదిరించి - ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు –తోడుగనున్నాడు
చరణం 6:సింహపు బోనులో దానియేలు - షద్రకు మేషా కబేద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్
నల్గురిగా కనబడినపుడు –తోడుగనున్నాడు
చరణం 7:పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపొస్తలులు విశ్వాసులు
హింసించబడినయపుడు-తోడుగనున్నాడు