CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 83

ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడా

prabhuvuku taginattu - pruthivilo priyudaa

కొలొస్స. 1:12 “ప్రభువునకు తగినట్టుగా నడువుము”

More
పల్లవి:ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడాపదిలముగా జీవించవా? (2)
చరణం 1:ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివై యుండ (2) ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో పావన వస్త్రముల నిచ్చెన్ (2)
చరణం 2:శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా హతసాక్షిగా నీ వుండెదవా?
చరణం 3:ప్రభు యడుగుజాడలను పరికించి ప్రభుకనుకూలంబుగా నడచినచో హనోకువలె ఆ రెండవ మరణము నొందక ప్రభుతో నుండెదవు
చరణం 4:పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభు సర్వాంగ కవచమున్ కల్గి నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్
చరణం 5:మృతులను సహలేపు మహాత్ముడని తన సుతునర్పించే నబ్రాహాము మృతికి లోనగు నీ శరీరంబును అతనికె బలిగానర్పించు
చరణం 6:తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు మౌనమున్ జూపి మరణము గోరె కడు శ్రమకాలములో ఖండించే ఖడ్గము ముంగిట నీవట్లుండెదవా?
చరణం 7:యెహోవా భయము నొంది యోసేపు ఎంత వైభవ మనుభవించెనోగాంచు నీ జీవితంబులో దైవభయము నొంది అక్షయ కిరీటమున్ బొందు