పల్లవి:ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నానుఎవని క్రియల ఫలితము వానికియ్య వచ్చుచున్నాను
చరణం 1:మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను (2)
ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి (2)
చరణం 2:నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
అపహరింపకుండునట్లు - జాగ్రత్తగా చూచుకో
చరణం 3:యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు
చరణం 4:వేవేగారా మా ప్రభు యేసు - వేచియున్నాము నీ కొరకే
నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము