CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 81

బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప

boora shabdambu ningin dhvanimpa

1 థెస్సలోనీ. 4:17 "దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును"

More
పల్లవి:ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా రమ్ము మా యేసు - పాడెదము (1) హల్లెలూయ - ఎంతో సంతోషం (1) ఎగిరి పోయెదం - పాటలతో (2)
చరణం 1:బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప - గాంచెదమేసున్ మా ఎదుట (1) ఓర్పుతో మేము వేచియుంటిమి (1)-నిద్రించే వారు నిలతురిలన్ (2)
చరణం 2:భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు దూతలు నింగిన్ ఏకమై కూడి - పాటతో బూర ధ్వనింతురు ||ప్రాణ||
చరణం 3:వేకువ చుక్క కాంతిని బోలి - సౌందర్యమైన మాధుర్యుడు పరలోకమందు హెచ్చయినవాడు - నా కొరకై శ్రమసహించెను ||ప్రాణ||
చరణం 4:రెప్పపాటుతో శుద్ధులు లేచి - మరుగైపోదు రాయనతోనుండన్ మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మేసు నచ్చట ||ప్రాణ||
చరణం 5:పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్బుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు ధరించి ఘనతనొందె దినం ||ప్రాణ||
చరణం 6:హల్లెలూయ ఆనందించెదం - హల్లెలూయ ఆర్భటింతుం హల్లెలూయా ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్ ||ప్రాణ||