పల్లవి:ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే (2)
చరణం 1:సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధిజేయునిలన్ - పరమునకై (2)
బుద్ధిహీనులను శ్రమల చేత (1)- బద్ధులుగ జేయున్ - వేదనతో
బాధ కలిగించున్ - సాతాను (2)
చరణం 2:స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్
తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్
ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము
చరణం 3:మొదట లేతురు సజీవులై - ప్రభుని యందుండు - ఆ మృతులు
మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము ధర నుండి
ధన్యులగుడుము - పరికించు
చరణం 4:వెయ్యియేండ్లు పా - లించెదరు ప్రియుని రాజ్యమున
ఆ ప్రియులు, సాయంసమయమున - చేరి - నెమలి కోకిలలు
ఆ రాజున్ - పాడి స్తుతించును ఆ దినము
చరణం 5:గొఱ్ఱెమేకలును - ఆ చిఱుత సింహజాతులును ఒకచోటన్
భేదము లేక బరుండి గరిక మేయును - ఆ వేళ
కలసి మెలగును - భయపడక
చరణం 6:న్యాయనీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్
ఆనాడు - సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు
ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా