పల్లవి:రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే (1) రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే (2)ఓ......... మేఘ వాహనంబు మీద వేగమేఓ........ మించు వైభవంబుతోడ వేగమే (2)
చరణం 1:ఓ...... భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ....... నీ జనంబు స్వాగతంబు నీయగా (2)
నీ రాజ్య స్థాపనంబు చేయ-భూరాజులెల్ల గూలిపోవ (1)
భూమియాకాసంబు మారిపోవ- నీ మహా ప్రభావమున వేగ (2)
చరణం 2:ఆ....... ఆకసమున దూతలార్భటింపగా
ఆ....... అది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన - ఏకమై మహాసభచేయ
లోకనాథ ! నీదు మహిమలోన మాకదే- మహానందమౌగా
చరణం 3:ఓ....... పరమ యెరూషలేము పుణ్య సంఘమా!
ఓ.........గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా !
పరమదూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా