పల్లవి:మాధుర్యంపు నామము - మోధమిచ్చు గానము వేదవాక్య సారము - యేసు దివ్యయేసు
చరణం 1:మహా వై ద్యుండు వచ్చెను - బ్రజాళిబ్రోచు యేసు
సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్
చరణం 2:మీ పాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్
గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు ॥మాధు||
చరణం 3:వినుండి గొఱ్ఱెపిల్లను - విశ్వాసముంచి యేసున్
ఘనంబుగన్ స్తుతించుడి మనంబుప్పొంగయేసున్ ॥మాధు||
చరణం 4:ఆ రమ్యమైన నామము - అణంచు నెల్లభీతిన్
శరణ్యులైనవారి నా - ధరించు నెంత ప్రీతిన్ ॥మాధు||
చరణం 5:ఓ యన్నలారా పాడుడీ - యౌదార్యతన్ సర్వేశున్
ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసున్ ॥మాధు॥
చరణం 6:ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
ధపించువారి దాతయా - దయామయున్ శ్రీ యేసు ॥మాధు॥
చరణం 7:శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును
ప్రియంపు దాసులౌచును - రయంబు గొల్వుడేసున్ ॥మాధు||