చరణం 1:ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్
నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
చరణం 2:ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
చరణం 3:ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్
పాపంబు బాయ నీ యొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
చరణం 4:ఉన్నట్టు నేను వచ్చెదన్ - కబోధినై నేనుండగన్
ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
చరణం 5:ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టినన్
మన్నించి చేర్చుకొమ్మయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
చరణం 6:ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను బిల్వగన్
నీ వాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా