CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 73

నాకై చీల్చబడ్డయో

naakai cheelchabaddayo

Rock of ages,cleft for me “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము" - యెషయా 26:4

More
చరణం 1:నాకై చీల్చబడ్డయో - నా యనంత నగమా నీలో దాగియుందును - జెన్ను మీర బారెడు రక్తజలధారలా - శక్తి గ్రోలగా నిమ్ము
చరణం 2:నేను నాదుశక్తిచే - నిన్ను గొల్వజాలను కాలమెల్ల నేడ్చినన్ - వేలకృతుల్ చేసినన్ నేను చేయు పాపము - నేనే బాపజాలను
చరణం 3:వట్టిచేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్ దిక్కులేని పాపిని - బ్రక్కజేర్చి బ్రోవుము నా కళంక మెల్లను - నాథా నీవె బాపుము
చరణం 4:ఈ ధరిత్రియందున - నేఱుదాటునప్పుడు నాదరించి నీకడన్ - నాకై చీల్చబడ్డయో నా యనంత శైలమా - నన్ను చేరదీయుమా