పల్లవి:మనకు జీవము యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమౌదుము ఆయన మహిమలో (2)
చరణం 1:ఆదియంతము ప్రభుయేసే - అదృశ్య దేవుని స్వరూపుడు (2)
అన్నింటిని నిర్వహించెదు - అద్భుత యేసుకే స్తోత్రములు (1)
చరణం 2:ప్రభుయేసు మరణించెను- విభుడు సర్వలోకముకై
ప్రభవిల్లను జీవమిచ్చెను- అభయునకే స్తుతి పాడెదము
చరణం 3:లోకముకై జీవించక - లోకేశునకై జీవించుచు
సాతానుపై జయమొందుచు - వీకతో నేగెదము స్తుతితో
చరణం 4:దైవత్వము గలయేసు - అవనిలో నుండుటే గొప్ప మర్మము
సంపూర్ణత గలవారమై - సత్యుండేసుని స్తుతించెదము
చరణం 5:పరలోక పౌరులుగా - పరిశుద్ధ ప్రజలముగా
సర్వములో క్రీస్తేనని - సర్వేశుని సన్నుతించెదము