పల్లవి:మీరు బహుగా ఫలించినచో - మహిమ కలుగును తండ్రికి (1)ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు (2)
చరణం 1:నీరు కట్టిన తోటవలె- నీటి వూటవలె నుండెదరు (2)
క్షామములో తృప్తినిచ్చి - క్షేమముగా మిమ్ము నడిపించును (2)
బలపరచును మీ యెముకలను (2)
అధికముగా ఫలించుడి (2)
చరణం 2:చెట్లు లేని మెట్టలలో - నదుల ప్రవహింపజేయు ప్రభువు
ఎండియున్న నేలనెల్ల - నీటి బుగ్గలుగా జేయువాడు
మన ప్రభువైన యేసునందు
అధికముగా ఫలించుడి
చరణం 3:వడిగా ప్రవహించు నదిని బోలి - విస్తరింపజేయు తన శాంతిని
ఐశ్వర్యముతో నింపు మిమ్ము - ముదిమి వరకు మిమ్ము మోయువాడు
మన ప్రభువైన యేసునందు
అధికముగా ఫలించుడి
చరణం 4:పాడెదరు మూగవారు - గంతులు వేసెదరు కుంటివారు
పొగడెదరు ప్రజలెల్లరు - ప్రభుని ఆశ్చర్యకార్యములను
మహిమ ఘనత చెల్లించుచు
హల్లెలూయ పాడెదరు