పల్లవి:స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (1)మహారక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)
చరణం 1:పాపలోక బంధమందు దాసత్వమందుండ (2)
నీ రక్త శక్తిచే ప్రభు విమోచించితివి (2)
చరణం 2:పాప భారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖబాధలు
చరణం 3:హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్య మార్గము జూపె
చరణం 4:పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగ జేసితివి