పల్లవి:యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె (1)
చరణం 1:నేను దూరమైతి నీకు - నశియించితి లోకమున (2)
నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను (1)
చరణం 2:నేను తలచలేదెప్పుడు - నా అంత మేమవునని
నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని
చరణం 3:నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి
చరణం 4:రక్షణ దొరికె నాకు - రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి
చరణం 5:పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి