పల్లవి:నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై (1) అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై (2)
చరణం 1:ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు (2)
అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా (2)
జీవించగోరితి నీ కొరకే- నీకే మహిమ ఘనత (2)
చరణం 2:వెలిగించు నా జీవము- నింపుము నీ ప్రేమతో
నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో
ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత
చరణం 3:నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును
నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము
మనస్సార ప్రేమింతు నిను ప్రభువా- నీకే మహిమ ఘనత