CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 69

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి

kreestesu prabhuvu tana raktamichi

అపొ . కార్య . 2 : 42 "వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును రొట్టె విరుచుటయందును, ప్రార్ధన చేయుట యందును ఎడతెగక యుండిరి”

More
పల్లవి:క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున (1)ఎవరు చేరెదరో వారె ధన్యులు పరలోకమే వారిది (2)
చరణం 1:అపొస్తలుల బోధను నవ్మి స్థిరపరచబడిన వారె (2) అత్మ శక్తితో వారు యెల్లప్పుడు సంఘములో నిలిచెదరు (2)
చరణం 2:పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు
చరణం 3:ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారె తనయందు నిలచెదరు ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు
చరణం 4:పట్టువదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారె
చరణం 5:క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకమునందు