పల్లవి:తలుపులు తెరచియుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా? (2) కాలమపాయముగా నుండె సమయము సద్వినియోగించు (2)
చరణం 1:చీకటి కాలము వచ్చుచుండె- కృపకాలము నుపయోగించు (2)
తలుపులు తెరచియుండగనే -విరిగిన మనస్సుతో సాగెదవా? (2)
చరణం 2:భీడు భూము లధికముగా- చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు- ప్రేమావార్తను చాటించు || తలుపు ||
చరణం 3:ఎన్నో రాజ్యము లీనాడు- దేవుని పనికి మూయబడే
తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు || తలుపు ||
చరణం 4:విశ్వాసుల సహవాసమున- ప్రేమా ఐక్యత గలదు
అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను || తలుపు ||
చరణం 5:రానైయున్న బాధ్యతలు -మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగటకై-వినయమున పోరాడెదము || తలుపు ||
చరణం 6:మాదు హృదయముల నింపు- నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో- నాథా నిన్నే చాటెదము || తలుపు ||