పల్లవి:క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినపుడు (1)మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది (2)
చరణం 1:యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)
మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను (2)
చరణం 2:నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు
చరణం 3:నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను
చరణం 4:నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును
చరణం 5:తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము
చరణం 6:మరణాంధకార లోయలో నేనుండ
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్
చరణం 7:ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్
దీనుడనై నీ మాట అంగీకరించెదను