పల్లవి:క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఓమేగ అది యంతము క్రీస్తే- యుగయుగములు క్రీస్తే (1)
చరణం 1:మనల రక్షించంచి - సిలువలో ప్రాణమిచ్చె (2)
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె (2)
చరణం 2:నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె
నేడే రక్షణ దినము - అంగీకరించుమిపుడే
చరణం 3:ఆయన ప్రత్యక్షత - ప్రేమించువారి కొరకు
ప్రభు తిరిగి వచ్చుచుండె పరలోక మహిమతోడ
చరణం 4:ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరిశుద్ధపరచబడెనో
వారే ప్రభురాక యందు సంతోషించెదరు మిగుల
చరణం 5:ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖబాధల్
బహుమానములుగ మారి కాంతి కిరీటమౌను
చరణం 6:ఆనంద బాష్పములతో - హల్లెలూయ పాటలు
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ