పల్లవి:సీయోను పాటలు సంతోషముగపాడుచు సీయోను వెళ్ళుదుము (2)
చరణం 1:లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకము నందు - కొంతకాలమెన్నో శ్రమలు (2)
చరణం 2:ఐగుప్తును విడిచినట్టి మీరు - అరణ్యవాసులె యీ ధరలో
నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు - కానానుపై నిలుపుడి
చరణం 3:మారానుపోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాటనమ్ము
చరణం 4:ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబు మాని - విధేయులై విరాజిల్లుడి
చరణం 5:ఆనందమయ పరలోకంబు మనది - అక్కడ నుండి వచ్చు నేసు
సీయోను గీతము సొంపుగ కలిసి - పాడెదము ప్రభుయేసుకు జై