పల్లవి:మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2)
చరణం 1:దేవుని దీవెనలు పొంద (2)
యౌవనులారా యేసుని సన్నిధికి రారండి (2)
దైవ కుమారుడు పావన క్రీస్తుని
జీవము పొంది నడుపుడి (2)
చరణం 2:యేసు నంగీకరించెడి వారి
పేరులు జీవ గ్రంథము నందు వ్రాయబడున్
నమ్మకమైయున్న పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
చరణం 3:దేవుని స్వరూపము కల్గిన
యేసు ప్రభు మనుజరూపంబున జన్మించెను
చావును గెల్చిన పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
చరణం 4:యేసు రక్తములో కడుగబడిన
తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి
గొప్ప కృపానిధి పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
చరణం 5:క్రీస్తుయేసుని యౌవన జనమా
ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి
సత్యరూపియగు పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
చరణం 6:రాజులరాజు ప్రభుల ప్రభువు
అనుపేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్
సర్వశక్తి గల పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి
చరణం 7:ప్రభుని పిలుపు పొందియున్న
యౌవనులార విశ్వసించి విజయము పొందుడి
శత్రువు నోడించి యేసు నామమున
హల్లెలూయ పాట పాడుడి