CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 61

నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడా

nee yauvvanamunu o yauvvanudaa

1 తిమోతికి 4:11 "నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము"

More
పల్లవి:నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడాచేయకు వ్యర్థము చేయకుము (2)
చరణం 1:దైవభక్తి యుండుటే జ్ఞానమునకు మూలము (2) దేవుని గూర్చిన తెలివి వివేచన కాధారము (2) జ్ఞానియైన యెడల నీకే లాభమగును (2)
చరణం 2:తృణీకరింపనియ్యకు నీ యౌవ్వనమును మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలో మాదిరిగ నుండుము విశ్వాసులకు
చరణం 3:సిలువయే నీ శక్తి గురిగా నుంచుము ప్రభు వాక్యము నీలో నివసింపనీయుము సాతానును జయించి బలము నొందుము
చరణం 4:నీ యౌవ్వనములో జ్ఞాపకముంచుకో ప్రభువు చూచి వినుచున్నాడని నీ సృష్టికర్తను స్మరియించుము
చరణం 5:ప్రభుని సేవకై అర్పించుకొనుము ఆత్మల రక్షణకై చాటించు సువార్తను నీ సేవ ద్వారా ప్రభు తృప్తి నొందును