CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 58

యువతి యువక - ప్రభున్ జేరుమా

yuvati yuvaka - prabhun jerumaa

ప్రసంగి 12 : 2 “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”

More
పల్లవి:యువతి యువక - ప్రభున్ జేరుమా దుర్దినములు -రాకముందే . (2 సార్లు)
చరణం 1:లేత వయస్సు - నడి ప్రాయము - గతియించి పోవున్ - గుర్తుంచుకో (2) గతియించని - క్రీస్తున్ చేరు (2) దుర్దినములు - రాకముందే
చరణం 2:నీ ఎదుట సరిగా - కనబడు మార్గం ఆ మార్గమే మరణమునకు - నిను చేర్చును జీవమార్గం - కోరుకొనుమా దుర్దినములు - రాకముందే
చరణం 3:శరీర క్రియలను - విడిచి పెట్టి - క్రీస్తు ప్రభువును - ఆశ్రయించు ఆత్మ ఫలముల్ - ఫలియించుమా దుర్దినములు - రాకముందే