CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 57

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు

kannulanetti pairula choodu koyaga lerevvaru

కీర్తనలు 126 :5 “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటకోసెదరు”

More
పల్లవి:కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (1)ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
చరణం 1:కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2)
చరణం 2:మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై?
చరణం 3:విశ్వాసప్రార్థనచే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద
చరణం 4:మందిరము పడియుండ మందుడవై నీ వుండి సరంబీ గృహములలో సంతోష సమయమిదా?
చరణం 5:మహిమ ఆర్భాటముతో క్రీస్తురాజు వేంచేయ నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా