పల్లవి:సిలువయే నీ గురిగా- నడువు యౌవనుడా (1)వెనుకంజ వేయకయే-నిలువు యేసు బండపై (2)
చరణం 1:మునుగు చుండె నీ జీవ నావ దాటించు వారెవ్వరు? (2)
యేసు ప్రభుండె దాటించువాడు (2)
నీదు చుక్కాని యేసే (2)
చరణం 2:వచ్చెను యేసు ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ
అక్షయుడు తెరచె నిశ్చయముగ
మోక్షద్వారము నీకే
చరణం 3:సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను
విమోచించును విశ్వసించిన
ముక్తిని పొందెదవు
చరణం 4:ప్రేమవార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే
మీ ఉల్లములకుప్రియమైన యేసే
శాంతినిచ్చెడి రాజు