CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 55

ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది

o ishraayelu - needu bhaagyamento goppadi

ద్వితీ. 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?

More
పల్లవి:ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది (1)యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు? (2)
చరణం 1:భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ (2) అత్యధికముగా చేతునని (2) - యెహోవా దేవుడే పల్కెన్ (2)
చరణం 2:నా నిబంధనను నే - రద్దు పరచ ననెగదా నా నోట నుండి వెళ్ళిన - మాటను మార్చననె గదా
చరణం 3:సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము తొలగిపోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు
చరణం 4:నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తి కలదు నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు
చరణం 5:నీవు భయపడకుము -బాదించువారు రాకుండను దూరముగా నుంచి యున్నాను - నీకు తోడై యున్నాను