పల్లవి:నీ వాత్మ యుద్ధములో జయ మొందుము (2)ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)
చరణం 1:స్వామి యేసు తన సిలువను మోసి - సైతాను రాజ్యము పూర్తిగా జయించె (2)
నీవును యేసుని వెంబడి వెళ్ళుమా (2)
ఓ నా సోదరా వెనుకంజ వేయకు (1)
ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)
చరణం 2:శిరమున ముండ్ల మకుటము ధరించి - సిపాయిచే తలపై కొట్టబడె
నీ శిరస్సు నట్లే సమర్పించు
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
చరణం 3:కల్వరిపైకి - ఒంటరిగానే - వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై
నీవును ఆ దారినే వెళ్లుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
చరణం 4:లోకస్తులంతా - నిద్రించుచుండగా - మోకాళ్ళపై యేసు - కొండపై నుండె
నీవును ప్రార్థన శక్తి నొందుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
చరణం 5:సాహసమున నీ వాత్మ ఖడ్గమున - సైతాను బంధము - ఖండించివేసి
క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు