CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 48

ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు

prabhuyesu naa rakshakaa - nosagu kannulu naaku

హెబ్రీ 12:2 “యేసు వైపు చూచుచు . . . పందెములో ఓపికతో పరుగెత్తుదము”

More
పల్లవి:ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే (2)
చరణం 1:ప్రియుడైన యోహాను - పత్మాసులో - ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2) ప్రియమార జూచి - బహుధన్యుడయ్యె ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2)
చరణం 2:లెక్కలేని మార్లు - పడిపోతిని -దిక్కులేనివాడ- నే నైతిని చక్కజేసి నా - నేత్రాలు దెరచి గ్రక్కున - నిన్ను జూడనిమ్ము
చరణం 3:ఎఱిగి యెఱిగి నే - చెడిపోతిని-యేసు నీ గాయము - రేపితిని మోసపోతి నేను - దృష్టి దొలగితి దాసుడ నన్ను - జూడనిమ్ము
చరణం 4:ఎందరేసుని వైపు - చూచెదరో - పొందెదరు వెల్గు - ముఖమున సందియంబు లేక - సంతోషించుచు ముందుకు - పరుగెత్తెదరు
చరణం 5:విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా- యేసు ప్రభూ వినయముతో నేను - నీ వైపు జూచుచు విసుగక - పరుగెత్త నేర్పు
చరణం 6:కంటికి కనబడని - వెన్నియో-చెవికి వినబడని - వెన్నియో హృదయ గోచరము - కాని వెన్నియో సిద్ధపరచితివా - నాకై?
చరణం 7:లోక భోగాలపై - నా నేత్రాలు - సోకకుండునట్లు - కృపజూపుము నీ మహిమ దివ్య - స్వరూపమును నిండార నను - జూడనిమ్ము