CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 45

ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము

o prabhuvaa ujjeevamu nimmu

కీర్తనలు 85:6 “నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?”

More
పల్లవి:ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము - విరిగిన మనస్సుతో నే వేడెదను (2)
చరణం 1:కోల్పోయితిని మొదటి ప్రేమను - చల్లారిపోయె నీ ప్రేమ నాలో (2) నాలో నిలుపుము నీదు ప్రేమ (2)
చరణం 2:పడినవారి యాశ్రయమా - విడువ బడిన వారి సహాయుండా గాయపు చేతితో లేపుమా
చరణం 3:శత్రుని యురిలో చిక్కియున్నాను - నాదు బంధకమును తెంపుము నీవు ఆనందము నిమ్ము మరల నాకు
చరణం 4:దోషిని నేను నీకు సఖులకు - అడుగుచుంటిని మన్నన మిమ్ము కడుగుము నీదు రక్తములోన
చరణం 5:ఐక్యతయే నా యభిలాష - నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము
చరణం 6:పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా - వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము బూడిద చేయుము నాలోని మష్టున్
చరణం 7:ఆత్మ ఉజ్జీప జ్వాలలు జగమున - కదలింపగ వ్యాపింప జేయుము హృదయమును ఫలియింప జేయుము