CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 44

కరుణించి తిరిగి – సమకూర్చు ప్రభువా

karuninchi tirigi – samakoorchu prabhuvaa

1 సమూ. 30:19 "దావీదు సమస్తమును సమకూర్చుకొనెను”

More
పల్లవి:కరుణించి తిరిగి – సమకూర్చు ప్రభువా (2)క్షమాపణ నిన్ను - వేడుచున్నాను (2)
చరణం 1:దావీదు రాజు - దీనుడై వేడ (2) అవనిలో బొందిన నష్టములన్నియు (2) దేవా నీవు - సమకూర్చితివే (2)
చరణం 2:శత్రు సమూహపు - కుతంత్రములతో - బొత్తిగ నేను - నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రీ
చరణం 3:పసరు గొంగళి - చీడపురుగులు నాశము చేసిన -పంటను కూర్చుమా యేసుప్రభూ - నిన్ను వేడుచున్నాను
చరణం 4:ప్రేమ సంతోషా - నందములను-ప్రధాన యాజకా - పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు - సమకూర్చుమా
చరణం 5:పాపపు విషముతో -నా పాత్ర నిండెను ప్రభు యేసుండను - పిండిని కలుపుము పాప మరణమును - తొలగించుమా
చరణం 6:ఆత్మీయ సోమరి - తనములో నుండి ఆత్మనష్టముల - నెన్నియో బొందితి ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
చరణం 7:పాపము చేసి - పడియున్న చోటున్ ప్రాపుగ నీవు జూపుమో ప్రభువా కోపగించక నాపై - కృప జూపుమా
చరణం 8:చేసిన పాపము - కప్పుకొనక -విశ్వాసముతో - ఒప్పుకొందున్ సిలువరక్తముతో - శుద్ధిచేయుమా