పల్లవి:నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును
చరణం 1:కరుణతోడ - పిల్చియు - స్థిరపరచి కాపాడిన (2)
స్థిరపరచిన నా ప్రభున్ - పొగడి - నే స్తుతింతును (2)
చరణం 2:ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు
మన్ననతోడ - నీదరిన్ చేర్చినన్ క్షమించితివి
చరణం 3:కృంగియుండు వేళలో - పైకి లేవ నెత్తితివి
భంగ పర్చు - సైతానున్ - గెల్చి విజయమిచ్చితివి
చరణం 4:నాకాశ్రయ శైలమై - కోటగా నీవుంటివి
ప్రాకారంపు యింటివై - నన్ను దాచి యుంచితివి
చరణం 5:సత్యసాక్షివైయుండి - నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా - ఆమెనంచు పాడెద