CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 25

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

rakshakudaa yesu prabho stotramu devaa

రోమా 8 : 35 "క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు?"

More
పల్లవి:రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా (1)స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)
చరణం 1:దేవుడే నా పక్షమైన విరోథెవ్వడు? (2) దూతలైనను - ప్రధానులైనను (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? (2)
చరణం 2:నరరూపమెత్తి ప్రభువు రక్తుడాయెను కరువైనను - ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
చరణం 3:సర్వలోక రక్షణకై - సిలువనెక్కెను శ్రమయైనను - బాధయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
చరణం 4:ఎంచలేని యేసు నాకై - హింసపొందెనే హింసయైనను - హీనతయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
చరణం 5:మరణమున్ జయించి క్రీస్తు - తిరిగి లేచెను మరణమైనను - జీవమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
చరణం 6:నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను - ఎత్తైనను లోతైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
చరణం 7:ఎన్నడైన మారని మా యేసుడుండగా - ఉన్నవైనను - రానున్నవైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ