పల్లవి:రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2)
చరణం 1:గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే (2)
చరణం 2:మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనస్సార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్
చరణం 3:మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు
చరణం 4:నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్
చరణం 5:సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు
చరణం 6:ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని
చరణం 7:కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను