పల్లవి:తరుణముండగ త్వరపడుము - ప్రభు రాకడ సమీపమాయెఏ జామో మరి ఏ క్షణమో - జాగు చేయక సిద్ధపడుము
చరణం 1:బుద్ధిమాలిన కన్యకలు- నిర్లక్షించి విడువబడిరి
బుద్ధికలిగి కునుకు మాని - నిరీక్షించు ప్రభు రాకడకై
చరణం 2:లోతు భార్య లోకము కొరకై - వెనుదిరిగి ఉప్పు స్తంభమాయె
లోకాశలకు లోబడక - సాగివెళ్ళుము ప్రభు క్రీస్తుతో
చరణం 3:సత్యమనే నడికట్టుచే - నీ నడుమును కట్టుకొనుము
ప్రకాశమైన క్రీస్తు వెలుగువలె- నీ దీపమున్ వెలుగనివ్వుము
చరణం 4:ఆత్మదీపమున్ ఆర్పకుము - అంతము వరకు వెలుగనిమ్ము
అన్నిటి అంతము సమీపమాయె మెలకువ కలిగి ప్రార్థించుము