చరణం 1:యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా? (1)
నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా? (1)
నీ వస్త్రమేసు రక్తములో శుద్ధియాయెనా? (1)
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా? (1)
చరణం 2:ఇరువురు తిరుగలి విసురుచుండగా
ఇరువురొకచోట నిద్రించుచుండగా
ఒకరెత్తబడి ఒకరు విడువబడుదురు
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?
చరణం 3:అవును యేసు రాగా నే సంధించెదను
నేను నిక్కముగా తిరిగి జన్మించితిని
నా వస్త్ర మేసు రక్తములో కడుగుకొంటిని!
అవును యేసురాగా సంధింప సిద్ధమే