పల్లవి:ప్రభు రాకడలో కనబడుటకు - నీవు సిద్ధమాప్రభు యేసును ఎదుర్కొనుటకు నీవు సంసిద్ధమా
చరణం 1:ప్రభుచే విమోచించబడిన నీవు - ప్రభు పనిని చేయుము
ప్రభువే ఇచ్చును బహుమానములను - పరిశుద్ధుల యెదుట
చరణం 2:నీదు క్రియలు దేవుని యెదుట - సంపూర్ణమైనవిగా
చేసిన యెడల పొందెదవు నీవు - తెల్లని వస్త్రములన్
చరణం 3:నిరీక్షణ కలిగిన వాడవై నీవు - ప్రకటించు సువార్తను
నిత్యరాజ్యంలో పొందెదవు నీవు - అక్షయ కిరీటము
చరణం 4:అపోస్తలుల బోధయు - సహవాసము నందున
రొట్టె విరుచుట ప్రార్ధన యందున - ఎడతెగకయుండి