పల్లవి:మహాదేవుండు - పరిశుద్ధుడగు తనయుని (2)అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము (2)
చరణం 1:పై నున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక (2)
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై (2)
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము (2)
చరణం 2:నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పైనున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
చరణం 3:లోకాన నరభేదము పాటింపక - పరలోక దేవుని సేవించుము
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పైనున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
చరణం 4:సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము
సమస్తమాయన పేరట చేయుచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము