పల్లవి:యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో (2)మహిమ గల నీ నామము గొప్పది
చరణం 1:పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ - బాలుర స్తుతి స్తోత్రములతో (2)
స్థాపించితివి నీవొక దుర్గము - నేదాగునట్లు ఆశ్రయ దుర్గము (2)
చరణం 2:నీ చేతి పనియైన ఆకాశమును - చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ - మానవుండు ఏ పాటివాడు
చరణం 3:నీ కంటే మానవుని కొంచెముగా - తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును - వానికి ధరింపజేసితివి
చరణం 4:అడవి మృగములు ఆకాశపక్షులు - సముద్ర మత్స్యములు పశువులు
వాని పాదముల క్రింద నుంచి - అధికారము వానికిచ్చితివి
చరణం 5:నీ నామము మా ప్రభువా యెహోవా - ఎంతో ఘనత ప్రభావము గలది
ఆ నామమును బట్టి మాకిచ్చితివి - నీ రూపమును మాకు హల్లెలూయ