పల్లవి:పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభు - సర్వసదా (2)యుగయుగములకు - రక్షకుడా (2) - మమ్ములను రక్షించితివి (2)జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు
చరణం 1:ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి (2)
శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున (2)
చరణం 2:ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి
పాపము తీసితివి - నీ కృప ఉన్నతము
చరణం 3:శత్రు సైతానున్ - ఓడించితి వీవు
నీ మరణము వలన విమోచించితివి
చరణం 4:శక్తి గలవాడా - చావున్ గెల్చితివి
శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి
చరణం 5:ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు
శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు
చరణం 6:ప్రవాహములోన - ప్రభు నేనుండినను
నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్
చరణం 7:జైజైయని పాడుడి - యేసునకే మహిమ
జైజై హల్లెలూయా - జైజై హల్లెలూయా