CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 185

రాజులకు రాజైన యేసు ప్రభువు

raajulaku raajaina yesu prabhuvu

మత్తయి 25:10 "సిద్ధపడియున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి"

More
పల్లవి:రాజులకు రాజైన యేసు ప్రభువు రానై యున్నాడు (2)ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)
చరణం 1:తెలిసి కొంటివా నీవెంత ఘోరపాపివో సిలువపై తీర్చెగా నీ పాపఋణమున్ (2) ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా (2)
చరణం 2:బుద్ధిలేని కన్యలవలె మోసపోతివా చేయలేవు ప్రభు సేవ నీశక్తితో నూనెలేక భ్రమతో బ్రతికెదవా లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా
చరణం 3:వాక్యముకై జీవితం అప్పగింపక దాచితివా తలాంతులను లెక్కచేయక మొదటి ప్రేమను తిరిగి పొందుమా లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా
చరణం 4:ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా