CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 184

ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు

unnata sthalamulapai nekkinchi choopinchu

ద్వితీ. కాం 32:7-17 "భూమి యొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించెను”

More
పల్లవి:ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు (1)ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా (2)
చరణం 1:మరణము మ్రింగబడే - ఘన విజయము ప్రాప్తమాయె (2) మరణము ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్ (2)
చరణం 2:ఎవరి మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో దైవశాంతి నొంది క్రీస్తుతో నిలిచి సంతస మొందెదరు
చరణం 3:ఆశ్చర్యకరుడాయెనే - ఆలోచన కర్తయును నిశ్చయముగా బహుబుద్దిధ వివేకము లిచ్చి నపుడు సదా
చరణం 4:చంచల హృదయములను - ముష్కరులగు పాపులను వంచన లేక వాక్యమునకు తలవంచి విదేయులౌదురు
చరణం 5:కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును
చరణం 6:పక్షిరాజు తనదు - పిల్లల కాచెడురీతి రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా
చరణం 7:సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు అందమైన యా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు