CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 186

జయించు వారిని కొనిపోవ ప్రభు

jayinchu vaarini konipova prabhu

1థెస్స . 4:13 - 18 "సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు"

More
పల్లవి:జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును (2)స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్ (2)
చరణం 1:ఎవరు యెదురుచూతురో సంసిద్ధులౌదురు (2) ప్రభు రాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చును (2)
చరణం 2:యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని సిద్ధపరతు స్థలమును నేనున్న చోట మీరుండ
చరణం 3:ఎవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును
చరణం 4:క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము
చరణం 5:తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులనుగా బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే
చరణం 6:సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా