పల్లవి:నా జీవిత సాగరమున - నను నడిపించుమా ప్రభువా (1)", "కుడియెడమకు తొలగకుండ - నను చక్కగ నడిపించు (2)
చరణం 1:అంధకార లోకములో - అంధుడనై నేనుండగా (2)
పందెరంగములో నేను గెలువ - నా ముందుగ నడుపుము (2)
చరణం 2:లోకములో మాయలకు - లోకుల మోమాటముకు
లోకువ నేను కాకుండునట్లు - మెళకువ నొసగుము ప్రభువా
చరణం 3:ఆత్మీయ యుద్ధములో - శత్రువును ఓడింపన్
సత్యవాక్య విశ్వాసములు - నిత్యము నొసగుము ప్రభువా