పల్లవి:యేసు నామం మనోహరం - ఎంతో అతి మధురం (1)పరము నందైన ఇహమునందైన వేరే నామమే లేదు (2)
చరణం 1:అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై
దాసుని రూపమొంది - ఇహముకు దిగివచ్చెను (2)
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం (2)
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్మునాశీర్వదింప (2)
చరణం 2:కల్వరిగిరిలోన ఇనుపమేకులతో
ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీనామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వదింప
చరణం 3:పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి
శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వదింప