పల్లవి:ఎంత జాలి యేసువాయింతయని యూహించలేను (1) ||ఎంత॥
చరణం 1:రక్షకుండా నాకు బదులు - శిక్షన నుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2) - చావొందితివి నాకై (1)
చరణం 2:ఏమి నీ కర్పించగలను - ఏమి లేని వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తోత్రమంచు పాడెద
చరణం 3:నీదు నామమునకు యిలలో - భయపడెడు వారికొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా
చరణం 4:నేను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చువాడా ప్రభువా
చరణం 5:నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చువాడ వీవు
నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా
చరణం 6:అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెదా